Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Sye Raa Narasimha Reddy Teaser Launch

ADVERTISEMENT

The teaser of Mega Star Chiranjeevi's much anticipated epic film ‘Sye Raa Narasimha Reddy’ is released on the eve of his birthday on 21st August at 11:30 am at Prasad Labs in Hyderabad. The event was attended by Chiranjeevi's mother Smt Anjana Devi, wife Surekaha, Ram Charan, director Surender Reddy, writers Paruchuri Brothers and other crew.

The film stars Nayanthara as the female lead. Some big actors like Amitabh Bachchan, Jagapathi Babu, Vijay Sethupathi, Kichcha Sudeep are also part of the cast. Surender Reddy is helming this freedom fighter film. Mega Power Star Ram Charan is producing this prestigious project on Konidela Productions banner.

Megastar Chiranjeevi’s mother launched this much awaited teaser and heaped praises on the teaser.

Surekha Konidela said, “The teaser is very very impressive. Words can’t explain how impressive it is. Thanks to Surender Reddy garu for carving it out wonderfully.”

On this occasion, Ram Charan said, “We have decided to release the teaser of Sye Raa Narasimha Reddy on the eve of my father’s birthday and we did it. We are planning to bring the film to audience for summer 2019. Everyone is eyeing for the teaser launch as the film is based on the life of freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. Everyone is waiting to see how it looks like. Our team has got positive response. Paruchuri Brothers might have told the story 12 years ago. Every time they visit our house, they used to discuss this topic. They worked for many films together. Be it with buildup in the story or with the technical lack, I don't know why it got delayed. The script went to floors now. It is only because of Paruchuri Brothers, their confidence and their determination, the film went on floors. I has been once again proved that a man can achieve anything if he set his mind to. I am travelling with Surender Reddy from the time of ‘Dhruva’. When I suggested him to meet Paruchuri Brothers regarding this. He listened to the script. As he knows how responsible work it is, he took some time to accept this. After the release of ‘Dhruva’ he met my father and he too accepted. Successes are not new to Rathnavel garu. ‘Khaidi No.150’, ‘Rangasthalam’ and now ‘Sye Raa Narasimha Reddy’. His visuals are extraordinary. I am very happy that Lee, who has worked for ‘Baahubali’, is working for this film. Kamal Kannan has given visual effects for ‘Magadheera’. I know him since then. Sai garu also worked with us earlier. I am a huge fan of Amit Trivedi garu’s music. He is the next biggest musician in India. A bollywood’s musician has grasped the Telugu nativity and giving lot of support. He has given wonderful background score in this teaser. I am thankful to Amitabh Bachchan, Nayanthara, Tamannaah, Jagapathi Babu, Vijay Sethupathi and Kichcha Sudeep and everyone who are part of the film.”

Paruchuri Gopala Krishna said, “Firstly, happy birthday to Chiranjeevi. We have released the teaser just a day before his birthday. I met with an accident in US in the year 2015. At that time doctors wondered how I am maintaining normal BP. But, it has become imposible to me to maintain that after watching at this 30 sec teaser of ‘Sye Raa Narasimha Reddy’. Just the 30 sec teaser has many goosebumps moments. What my situation would be after watching the whole film. My BP levels may shoot up to 1000 if I look into Chiranjeevi’s eyes while he is riding a horse. If an extraordinary team teams up with an extraordinary actor, the product will be out of the world. So far we have penned 365 movies. And out of them there are 10 to 15 movies which are very close the heart. If some someone asks me which script made you proud, it is ‘Sye Raa Narasimha Reddy’ without any doubt. This is unforgettable film in our career. Our journey with Chiranjeevi garu started in 2006. No doubt ‘Sye Raa Narasimha Reddy’ is going to create history.”

Rathnavel said, “This is a prestigious project. Charan is a passionate film lover. Generally, producers will be very cautious about budget. But, at the beginning of this project Ram Charan came to me and said that ‘Sye Raa Narasimha Reddy’ is my father’s dream project and once in a lifetime project. Director Surender Reddy and the rest of the technical team are working hard.”

Lee Whittaker said, “I am very happy that I am part of this film. I was moved when I was approached with the script of a freedom fighter ‘Sye Raa Narasimha Reddy’ who inspired the nation. I feel it as a privilege that I am part of this film.”

Director Surender Reddy said, “We are talking about ‘Sye Raa Narasimha Reddy’ to the press for the first time. Uyyalawada Narasimha Reddy is the first freedom fighter. He was the first man on our Telugu land. Initially I was not aware of his greatness. We have researched on this subject for one year after the take off. We have collected right from the gazette notes. The incidents that happened then are still in gazette notes. We interacted with Uyyalawada’s friends and relatives. There is an association there and we approached them too to know more about this unsung hero. Everyone is going watch this on the screen. We realized how apt Chiranjeevi garu is for this character while working with him. I feel proud that I am directing him. Chiranjeevi garu is keeping heart and soul starting from fights to each and each and every aspect. He is doing fights without body double. I realised that there is a lot to learn from him. That is why I am working for this film with full dedication. Ram Charan is the main pillar for this film. Rathnavel and Rajeevan are the big assets. Paruchuri Brothers and Sai garu and everyone in the team are working hard. All my earlier films were different and this is different. This will be beyond expectations. Amit Trivedi is musical genius. It’s a gift from Charan."

నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`ని నిర్మించడం ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాను - మెగాపవర్స్టార్ రామ్చరణ్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్ వేల్యూస్తో.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ ప్రధాన తారాగణంగా మెగాపవర్స్టార్ రామ్చరణ్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్తో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో టీజర్ను విడుదల చేశారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవి, చరణ్ అమ్మగారు సురేఖ ఈ టీజర్ను విడుదల చేశారు.

అంజనాదేవి మాట్లాడుతూ - ''అదిరిపోయింది. చాలా బావుంది'' అన్నారు.

చిత్ర సమర్పకురాలు శ్రీమతి సురేఖ కొణిదెల మాట్లాడుతూ - ''చాలా చాలా బావుంది. మాటలు సరిపోవు. చూడ్డానికి చాలా బావుంది. సురేందర్రెడ్డికి థాంక్స్. చాలా బాగా తీశారు. చాలా బావుంది'' అన్నారు.

చిత్ర నిర్మాత, మెగాపవర్స్టార్ రామ్చరణ్ మాట్లాడుతూ - ''సైరాని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే అందరిలో సైరాలో ఏముంది? అసలు నరసింహారెడ్డి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి ఎగ్జయిటింగ్గా ఉన్నారు. కాబట్టి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేద్దామని నిర్ణయించుకున్నాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ మా టీమ్కి వచ్చింది. బహుశా 12 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ మా ఇంటికి వచ్చినప్పుడు 'నాన్నగారితో సైరా గురించి చెప్పు' అనేవారు. వాళ్లు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయినా నేను చెప్పడమేంటండీ అని అనేవాడిని. కథ బిల్డప్ కారణంగానో, టెక్నికల్ ల్యాక్ కారణంగానో ఎందుకు డిలే అయిందో తెలియదు. ఇప్పటికి ఓకే అయింది. ఇప్పటికైనా ఓకే అయిందంటే దానికి ముఖ్య కారణం పరుచూరి సోదరులు. వారి గట్ట నమ్మకం, సంకల్పమే ఈ సినిమాను ఇవాళ కార్యరూపం చేయించింది. 12 ఏళ్లుగా వాళ్లు సాధన, మెడిటేషన్ చేస్తే వచ్చింది. ఒక వ్యక్తి ఒక విషయం మీద అలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సూరిగారితో ధ్రువ నుంచి ట్రావెల్ అవుతున్నాం. చాలా ఎంజాయ్ చేశాం. సూరిగారి కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు నేను పరుచూరి సోదరులను ఒకసారి కలవండి సార్. ఇలా ఉంది అని అన్నాను. కథ విన్నారు. నాన్నగారితో మీరు చేస్తే బావుంటుందనగానే మామూలుగా ఏ డైరక్టర్ అయినా వెంటనే గెంతేసేవారు. కానీ సురేందర్రెడ్డిగారు కాస్త టైమ్ తీసుకుని, నాన్నగారితో సినిమా అంటే ఎంత బాధ్యత ఉంటుందో ఊహించుకుని ఈ సినిమాకు అంగీకారం తెలిపారు. కథ విని, ఆయన శైలికి అర్థం చేసుకుని నాన్నగారిని కలిశారు. 12ఏళ్లుగా నానుస్తున్న విషయాన్ని నాన్నగారు ఒక్క సిట్టింగ్తో ఓకే చేసేశారు. రత్నవేలుగారు ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, ఇప్పుడు సైరా.. ఆయనకు హిట్లు కొత్త కాదు. ఆయన విజువల్స్ మామూలుగా ఉండవు. లీగారు బాహుబలి 2 లోనూ పనిచేశారు. ఆయన ఈ ప్రాజెక్ట్ లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. కమల్ కణ్ణన్గారు మగధీరకు విజువల్ ఎఫెక్ట్స్ చేశారు. అప్పటి నుంచి నాకు తెలుసు. సాయిగారు ఇంతకు ముందు కూడా మాతో పనిచేశారు. అమిత్ త్రివేదిగారి మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్. ఇండియలో నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యూజిషియన్ అని అంటున్నారు. ఇన్నేళ్లలో నాన్నగారు ఒక ట్యూన్ని వినగానే ఓకే చేయడం అనేది ఎప్పుడూ లేదు. అదే అమిత్గారు క్లైమాక్స్ సాంగ్ ఇందాకే పంపారు. నాన్నగారు వినగానే ఓకే చేసేశారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓ హిందీ వ్యక్తి మన తెలుగుదనాన్ని అర్థం చేసుకుని మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. చిన్న టీజర్లోనే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే అమితాబ్గారు, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతిబాబుగారికి ధన్యవాదాలు. ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదల చేస్తున్నాం. బడ్జెట్ గురించి ఆలోచించడం లేదు. డాడీ డ్రీమ్ప్రాజెక్ట్ కాబట్టి వెనకా ముందూ చూడకుండా, దేనికీ వెనకాడకుండా తీస్తున్నాం. ఎక్కువగానే పెట్టి చేస్తున్నాం. నాకైతే ప్రాఫిట్స్ వస్తే బోనస్. రాకపోయినా ఆనందమే. ఖర్చును, మరోదాన్ని ద ష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నాం. ఇలాంటి మూవీ చేస్తున్నందకు ప్రెస్టీజియస్గా, ఫ్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాన్నగారు 'కొదమసింహం' గుర్రంపై చేసిన ఫీట్ చూసే నేను గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ఇక ఈ ట్రైలర్స్లో కొన్ని జంతువులు ఉన్నాయి. కాబట్టి టీజర్ను థియేటర్స్లో ప్రదర్శించడానికి జంతు సంరక్షణ సంస్థను అప్లై చేశాం. రెండు వారాల్లో టీజర్ను థియేటర్స్లో ప్రదర్శిస్తాం'' అన్నారు.

చిత్ర దర్శకుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ - ''సైరా నరసింహారెడ్డి... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర. ఉయ్యాలవాడ మన నేల మీద తొలిస్వాతంత్ర సమరయోధుడు. తెలుగు నేల మీద ఆయనే తొలి వ్యక్తి. ఈ సినిమాను మొదలుపెట్టేటప్పటికీ నాక్కూడా తెలియదు. టేకాఫ్ చేశాక ఏడాది పాటు రీసెర్చి చేశాం. గెజట్ నోట్స్ నుంచి కలెక్ట్ చేశాం. ఆ టైమ్లో జరిగిన సంఘటనలు ఇప్పటికి కూడా గెజెట్ నోట్స్ లో ఉన్నాయి. ఉయ్యాలవాడకు సంబంధించిన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. అక్కడ ఓ సమితి ఉంది. అక్కడ కూడా సంప్రదించాం. ఆయన అన్సంగ్ హీరో. దాన్ని రేపు అందరూ తెరమీద చూడబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవిగారు చేయడం నా అద ష్టం. ఆయన ఎంత యాప్టో సినిమా చేస్తున్నప్పుడు అర్థమవుతోంది. నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. చిరంజీవిగారు ఫైట్స్ నుంచి ప్రతి విషయంలోనూ చాలా కష్టపడుతున్నారు. ఆయనే డూప్ లేకుండా ట్రై చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా మొదలయ్యాక నేనిప్పటి వరకు నేర్చుకున్నది నథింగ్. ఆయన్ని చూశాక ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థమైంది. అందుకే అదే భక్తితో పనిచేస్తున్నా. ఈ సినిమాకు నాకు మెయిన్పిల్లర్ చరణ్గారు. ఎందుకంటే ఈ సినిమాకు నాకు ఏం కావాలని అనుకున్ననో, దానికి ఎక్కువగా ప్యాషన్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమాకు మేజర్ ఎసెర్ట్ రత్నవేలుగారు, రాజీవన్. నేనే సినిమా చేసి ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నప్పుడు కొత్త ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్, సాయిగారు.. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇది టీమ్ వర్క్. అద్భుతంగా జరుగుతోంది. కాస్ట్యూమ్స్ సుష్మితగారు, ఉత్తరగారు చేస్తున్నారు. లీవీటెక్కర్, కమల్కణ్ణన్గారూ.. అందరూ పనిచేస్తున్నారు. నేను ఇంతకు ముందు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఈ సినిమా అందరికీ ఎక్స్ పెక్టేషన్స్ కి మించి ఉంటుంది. ఎంతైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇంకొక్క విషయం అమిత్ త్రివేది గురించి చెప్పాలి. ఆయన మ్యూజికల్ జీనియస్. ఆయన్ని నిజంగా నాకు ప్రొవైడ్ చేయడం అనేది చరణ్గారు ఇచ్చిన గిఫ్ట్. ఈ సినిమాకు అమిత్గారు పెద్ద ఎసెట్. నిజంగా అమితాబ్గారిని డైరక్ట్ చేయడం నా లక్. చిరంజీవిగారిని డైరక్ట్ చేయడం అనేది నేను కల్లో కూడా ఊహించలేదు. నేను థియేటర్లో బట్టలు చింపుకుని వచ్చి చిరంజీవిగారి సినిమాకు టిక్కెట్లు కొని చూసేవాడిని. అలాంటి స్థానం నుంచి వచ్చి నేను ఆయన్ని డైరక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోనుకూడా లేదు. నా అద ష్టమది. అదే సమయంలో చిరంజీవిగారితో పాటు అమితాబ్గారిని, సుదీప్గారినీ... వీళ్లందరినీ చేయడం అనేది గొప్పే. ముందు నాకు ఎగ్జయిటింగ్గా అనిపించేది. కానీ షూటింగ్ సమయంలో చాలా బాగా అనిపించింది. అమితాబ్గారు ముందు మెగాస్టార్కారణం కోసం ఓకే అన్నారు. స్క్రిప్ట్ విన్న తర్వాత డబుల్ ఓకే అన్నారు. ఇలాంటి అన్ సంగ్ హీరోలు ఇండియాలో చాలా మంది ఉన్నారు. తొలిసారి ఇలాంటి స్క్రిప్ట్ మీరు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను చేస్తున్నాను అని భరోసా ఇచ్చి చేశారు'' అన్నారు.

రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ - ''మెగాస్టార్ సినిమాకు మాటలు రాస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. ఖైదీ నెంబర్ 150కి నన్ను పిలిపిస్తే ఆ సినిమాలో ఒక్క డైలాగ్ నేను రాసింది చిరంజీవిగారు పలికినా నా జన్మ ధన్యం అని నేను అనుకున్నా. అలాంటిది రెండు సినిమాలు రాశా. ఖైదీ నెంబర్ 150, సైరా. నా జీవితం తరించిపోయింది. రేపు ఒక అద్భుతాన్ని అందరూ చూడబోతున్నారు. అద్వితియాన్ని ఆస్వాదించబోతున్నారు. ఇప్పుడు చూసిన టీజర్ ఇలా ఉంటే, సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. చిరంజీవిగారు సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే సినిమా సూపర్ హిట్. అందులో ఏ మార్పూ లేదు. చిరంజీవిగారి తల్లిగారు, చరణ్గారి తల్లిగారు కలిసి ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఇద్దరు మాత మూర్తుల ఆశీస్సులతో ఈ సినిమా విడుదల కాబోతోంది. తల్లి ఆశీస్సులకు మించింది ఏదీ లేదు ఈ భూమ్మీద. ఇద్దరు తల్లుల ఆశీస్సులతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుందో మీరు ఊహించుకోండి. ఇలాంటి సంచలనమైన సినిమాలో నేనూ ఓ భాగమైనందుకు తలవంచి నమస్కారం చేస్తున్నా. ఈ సినిమాలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది టీమ్ వర్క్. అందరూ నన్ను నడిపించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగులను చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకుని ఇక్కడికి వచ్చాను. సురేందర్ రెడ్డిగారు ఎంతో ప్రోత్సహించారు. ఈ సినిమాకు అవకాశం ఇచ్చినందుకుగానూ చరణ్గారికి, చిరంజీవిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను'' అన్నారు.

కమల్ కణ్ణన్ మాట్లాడుతూ - ''ఈ సినిమా నా మనసుకు దగ్గరగా ఉన్న సినిమా. గత కొన్ని నెలలుగా దీనికి పనిచేస్తున్నాను. రామ్చరణ్గారికి, సురేందర్రెడ్డిగారికి ధన్యవాదాలు. చాల మంచి సినిమా ఇది. ఫ్యాబులస్ పిక్చర్. ఈ టీమ్ పెద్ద సక్సెస్ని సాధించాలి'' అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''చిరంజీవిగారి జీవితం, మా జీవితం ఖైదీ అనే సినిమాతో బాగా ముడిపడి ఉంది.అప్పుడే మేం ఒకళ్ల ఇంట ఒకళ్లం. ఒకళ్ల మనస్సుల్లో ఒకళ్లం ఖైదీలైపోయాం. ఇప్పుడు దొంగ మీద సినిమా చేస్తే... దొంగ, అడివి దొంగ, కొండవీటి దొంగ.. ఏ దొంగ అయినా మేమే. అట్లా ఎన్నో జరిగాయి. బుర్రా సాయిమాధవ్ మా సినిమాలు చూశామని అన్నాడు. కానీ చాలా బాగా రాస్తున్నాడు. శ్రీకర్ ప్రసాద్ కి ఆల్ ఇండియా రేంజ్లో ఎన్నో అవార్డులు పొందాడు. రత్నవేలు నన్నయినా అందంగా చూపించగల వ్యక్తి. కమల్కణ్ణన్ చాలా మంచి టెక్నీషియన్. మమ్మల్ని అందరినీ క ష్ణుడిలాగా, అర్జునుడిలాగా నడిపే వ్యక్తి మా దర్శకుడు. చాలా నవ్వుతూ ఉంటాడు. కానీ ఏది కావాలన్నా.. చేయించుకుంటాడు. ముందు మాత్రం చెప్పడు. ఈ సినిమాకు అతను ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాడు. సురేందర్రెడ్డిని చరణ్బాబు ఎందుకు ఎంపిక చేసుకున్నాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఇక నాకూ, చిరంజీవిగారికీ ఓ పోలిక ఉంది. మేమిద్దరం సోమవారంపుట్టాం. మామూలుగా ఈశ్వరుడు సోలెడు వరాలైనా ఇస్తాడట కానీ, కొడుకును మాత్రం ఇవ్వడట . ఎందుకు ఇవ్వడా అని అడిగితే ఆ రోజు పుట్టిన కొడుకు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడట. చిరంజీవిగారి మంచితనం, ఆశీస్సులు నడిపిస్తున్నాయి. చిరంజీవిగారి కొడుకు చరణ్ చాలా తెలివైనవాడు. ఎవరి మనసులో ఏం ఉందో ముందే చెప్పేస్తుంటాడు. ఈ సినిమా ఓ అద్భుతం. ఈ విషయాన్ని తక్కువగానే చెప్పమని అంటున్నారు చిరంజీవిగారు. ఎందుకంటే చూసి జనాలు చెప్పాలని చిరంజీవిగారు నమ్మకం. సైరా నరసింహారెడ్డి పది కాలాల పాటు ఉంటుంది. మాకూ, మా తమ్ముడికి ఇంతకంటే మంచి అద ష్టం లేదు. అది మా నమ్మకం'' అన్నారు.

పరుచూరి గోపాలక ష్ణ మాట్లాడుతూ - ''చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజుకు ఎన్నో కోట్ల మంది ఆనందపడతారు. ఒక రోజు ముందు మేం టీజర్ని విడుదల చేశాం. 30 సెకన్లటీజర్ని చూసే బీపీని మెయింటెయిన్ చేయలేకపోయాను. ఇప్పుడు నా బీపీ డబుల్గా ఉంటుందేమో. 30 సెకన్లకే ఇంత ఉంటే రేపు మూడు గంటల సినిమాకు ఇంకెంత బీపీ రావాలి? నాకు అర్థం కావట్లేదు. చూస్తే చిరంజీవిగారి నటన కళ్లల్లోనే ఉంటుంది. ఓ అద్భుతమైన నటుడికి అద్భుతమైన సాంకేతిక నిపుణులు తోడైతే మహాభారత యుద్ధంలో ధర్మరాజు యుద్ధం చేసినట్టే. ఇక్కడ మా ధర్మరాజు రామ్చరణే. ఎందుకంటే గెలిచి తీరతారు ఎవరైనా. ఇంత మంది సైన్యాధిపతులు అండగా ఉన్నప్పుడు అర్జునుడు చిరంజీవిగారు. ఆయనే యుద్ధం చేస్తున్నారు. అద్భుతమైన 356 సినిమాలు రాశాం. మాకు ఆనందాన్ని కలిగించిన సినిమాలు పది, పదిహేను ఉన్నాయి. అయితే ఏ సినిమా రాసినందుకు గర్వపడుతున్నారు అని అడిగితే మాత్రం 'సైరా' రాసినందుకు గర్వపడుతున్నా అని చెప్తాం. ఇది మా జీవితంలో మర్చిపోలేని సినిమా. 2006లో చిరంజీవిగారితో ప్రారంభించిన ప్రయాణం అది. 12 ఏళ్ల కి ఒకసారి మన దగ్గర పుష్కరాలు వస్తాయి. అలా పుష్కరాలు వస్తేగానీ చిరంజీవిగారు ఆసినిమాకోసం మేకప్ వేయలేదు. ఈ సినిమా కోసం 12 ఏళ్లు పట్టింది. ఎందుకు 12 ఏళ్లు పట్టిందో , ఇప్పుడు వస్తుందో ప్రపంచానికే తెలియాలి. ఏదైనా 'సైరా నరసింహారెడ్డి' చరిత్ర స ష్టిస్తాడు. ఇది నిజం''అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ - ''ఈ సినిమా ప్రెస్టీజియస్గా చేస్తున్నాం. చరణ్ ప్యాషనేట్ ఫిల్మ్ లవర్. నిర్మాతలు బడ్జెట్ విషయంలో కంట్రోల్డ్ గా ఉంటారు. కానీ బిగినింగ్లో చరణ్ నా దగ్గరకు వచ్చి 'ఇది నా తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్. లైఫ్ టైమ్ ప్రాజెక్ట్' అని అన్నారు. దర్శకుడుగారు, మిగిలిన సాంకేతికి నిపుణులందరూ చాలా బాగా చేస్తున్నారు. అందరూ ఎక్స్ ట్రార్డినరీగా చేస్తున్నారు. ఇది టీజరే. ట్రైలర్లో మాట్లాడుతాను'' అన్నారు.

ఫైట్ మాస్టర్ లీ విట్టేకర్ మాట్లాడుతూ - ''నేను ఈ సినిమాలో ఉండటం ఆనందంగా ఉంది. స్వాతంత్య్రం వైపు ఓ వ్యక్తి వేసిన అడుగులు ఓ జాతిని ఉత్తేజపరిచాయనే ఈ కథను నాకు చెప్పినప్పుడు, నన్ను ఇందులో భాగమవ్వమని అడిగినప్పుడు... అది నన్ను కదిలించింది. ఈ సినిమాలో పనిచేయడం గౌరవంగా భావించాను. ఎంతో మంది సోదర,సోదరీ మణులు పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది'' అని అన్నారు.

సుష్మిత మాట్లాడుతూ - ''చాలా ఉత్కంఠగా ఉంది. టీజర్ చూసి భావోద్వేగానికి గురయ్యాం. చరణ్కి, మా నాన్నకి, దర్శకుడికి చాలా థాంక్స్. చాలా మంచి టీమ్ పనిచేస్తున్నారు. కాస్ట్యూమ్ డిపార్ట్ మెంట్లోనూ చాలా మంది పనిచేస్తున్నారు'' అన్నారు.

Here is the teaser - 

 

Pages: 1 2
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
ADVERTISEMENT
Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch Sye Raa Narasimha Reddy Teaser Launch
Pages: 1 2
ADVERTISEMENT
ADVERTISEMENT