రొటీన్ లక్షణాలున్న అబ్బాయి (‘ఎమ్ఎల్ఏ’రివ్యూ)
రాబోయే ఎలక్షన్స్ కు మెల్లిమెల్లిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ని మీడియా మానసికంగా రెడీ చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఆ వార్తలే వినపడుతున్నాయి. కనపడుతన్నాయి. ఈ నేపధ్యంలో ఆ రాజకీయ రణరంగాన్ని ప్రతిబింబిస్తూ సినిమాలు వస్తే జనం బాగా కనెక్ట్ అవుతారనటంలో సందేహం లేదు. ఇది గమనించారో ఏమో కానీ... ఇలాంటి సమయంలోనే పక్కా పొలిటికల్ టైటిల్ ‘ఎమ్ఎల్ఏ’ తో, స్టోరీ లైన్ తోనే కళ్యాణ్ రామ్ మన ముందుకు వచ్చాడు. అయితే నిజంగానే ఈ సినిమాలో రాజకీయం ఉందా.. ఏ మేరకు వర్కవుట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ యుద్దాన్ని ఎంతవరకూ ఈ సినిమా ప్రతిబింబింది. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఏ మేరకు తెలుగు పరిశ్రమతో నిలదొక్కుకుంటాడు..ఇంతకీ ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని ప్రపంచంలోని సమస్త జనలు చేత పిలవబడుతున్న కళ్యాణ్ (కళ్యాణ్ రామ్)...ఓ సుముహార్తాన నందు (కాజల్)ని చూసి అమాంతం ప్రేమలో పడిపోతాడు. నందు మొదట బెట్టు చేసినా ఆ తర్వాత సరే అన్నట్లు సిగ్నల్ ఇస్తుంది.దాంతో ఆమెతో డ్రీమ్ సాంగ్స్ గట్రా వేసుకుని ఆమె తండ్రిని కలవటానికి వెళ్తాడు. అయితే ఇక్కడో ట్విస్ట్.
ఇందు తండ్రి నాగప్ప (జయప్రకాష్ రెడ్డి) కి కుమార్తె పెళ్లి విషయమై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆయన జీవితాశయం తన అల్లుడు ఎమ్మల్యే అయి ఉండాలని. అందుకోసం లోకల్ ఎమ్మల్యే గాడప్ప (రవికిషన్) కి తన కూతురు ఇచ్చి పెళ్లి చేయటానికి రెడీ అవుతాడు. అదే విషయం కళ్యాణ్ కు చెప్పి వెళ్లి పనిచూసుకోమంటాడు.
దాంతో కళ్యాణ్ ఊరుకుంటాండా.. అదెంత పని .. ..నేనూ ఎమ్మల్యేని అవుతాను..మీ కూతురని పెళ్లి చేసుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు.అదెంత ఈజీ పనికాదని అంతా నవ్వేస్తారు. నిజమే రాత్రికిరాత్రి ఎమ్మల్యే అవ్వాలంటే మాటలా.. మొదట ఆల్రెడీ అక్కడ లోకల్ ఎమ్మల్యే గాడప్ప (రవికిషన్) చేత రాజీనామా చేయించి, తిరిగి ఎలక్షన్స్ రప్పించాలి. ఆ తర్వాత అతనిపై గెలవాలి. రాజీనామాకు గాడప్ప ఒప్పుకుంటాడా.. అసలే గాఢప్ప ..గాఢమైన విలన్ లక్షణాలు ఉన్నవాడు..పనికిమాలిన పనులు చేయటంలో పీహెచ్ డీ చేసిన వాడు.
పోనీ ఏదో మాయ చేసి అతని చేత రాజీనామా చేయించి, ఎలక్షన్స్ రప్పించినా..ఊరు పేరు తెలియని కళ్యాణ్ కు జనం ఓట్లు వేస్తారా...ఈ సమస్యలను కళ్యాణ్ ఎలా దాటాడు..తను ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడనేది మిగతా కథ.
ఎంతసేపూ కామెడీ చేసేసి దాటేద్దామనే కానీ..
ఒక వ్యక్తి ఎమ్మల్యే గా నామినేషన్ వెయ్యాలంటే ఏం చేయాలి...జనం ఎటువంటి వ్యక్తిని ఎమ్మల్యేగా ఎన్నుకుంటారు..ఈ రోజుల్లో ఎమ్మల్యేగా గెలవటంలో ఉండే అడ్డంకులు ఏమిటి..ఓ సామాన్యుడు ఎమ్మల్యేగా నిలబడి గెలిచే వాతావరణం అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉందా... ఎమ్మల్యేగా నిలబడాలంటే ఏదన్నా పార్టీ అండ ఉండాలా...లేక ఇండిపెండిట్ గా నిలిస్తే నెగ్గగలడా..వంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇలాంటి ఎమ్మల్యే వంటి చిత్రాలు వచ్చినప్పుడు వాటిలో దొరుకుతాయామో అని ఆశిస్తారు.
ఈ ప్రశ్నలకు కొంతలో కొంతైనా సమాధానం చెప్తూ... రాజకీయంగా గా ప్రస్తుతం బయిట జరుగుతున్న ఎత్తుకు పై ఎత్తులను, అరాచకాలను, సోషియా మీడియాలో జరుగుతున్న ప్రచార యుద్దాలను వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ...కథ నడుస్తుందని ఆశిస్తాం. అయితే సినిమా ప్రారంభమైన కాస్సేపటికే ఈ సినిమాకు అంత సీన్ లేదు అని అర్దమైపోతోంది. ఏదో నాలుగు కామెడీ సీన్స్, రెండు మాస్ ఫైట్స్ పెట్టి పాసైపోదామనే మూడ్ కనపడుతుంది. అంతేతప్ప ప్రస్తుత సమాజంలోని రాజకీయ వాతావరణం మచ్చుకైనా కనపడదు. అలాంటి కథకు మనం ఎలా కనెక్ట్ అవుతాం.
అలాగే ... ఇంట్రవల్ అయ్యేదాకా ...అసలైన కథలోకి రారు. దాంతో ఫస్టాఫ్ మొత్తం కథకి సంభందం లేని వేరే వ్యవహారం నడుస్తున్నట్లు ఉంటుంది. సెకండాఫ్ కథలోకి వచ్చాక అయినా ఏదన్నా అద్బుతం జరుగుతుందా అంటే... అంత పెద్ద విలన్...హీరో కామెడీ గా చేసే ఛాలెంజ్, చేష్టలకు తలూపుతూ,భయపడిపోతూ దిగజారిపోతూంటాడు. అంతేకానీ ఎదురుదెబ్బతీయడు. అలా పూర్తిగా హీరో పాత్ర పాసివ్ గా మారిపోయి మనల్ని పారిపోయేలా చేస్తుంది. ఫైనల్ గా అల్లరి నరేష్ కోసం అనుకున్న కథని కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నట్లుగా సిల్లీగా సీన్స్ వచ్చి పోతూంటుంది. మెయిన్ స్ట్రీమ్ హీరో కోసం చేసిన కథలా అనిపించదు.
కేరాఫ్ శ్రీనువైట్ల కామెడీ
ఏంటో సినిమా ప్రారంభం నుంచి శ్రీను వైట్ల గుర్తుకు వస్తూనే ఉంటారు. ఇంట్రవెల్ ట్విస్ట్, బ్రహ్మానందం ఎంట్రీ, పృధ్వీ క్యారక్టరైజేషన్..అన్నీ శ్రీను వైట్ల గత చిత్రాలను గుర్తు చేస్తాయి. అయితే శ్రీను వైట్లే తన సినిమాలు మార్కెట్లో చెల్లుబాటు కాక కొత్తదనం కోసం తాపత్రయపడుతూ తన రూట్ మార్చుకునే ప్రయాణంలో ఉన్నారు. అలాంటి శ్రీను వైట్ల సినిమాని అనుకరిస్తే ఏమి వస్తుంది. అలాగని పూర్తిగా శ్రీను వైట్ల స్దాయిలో కామెడీని పండించలేకపోయారు..నవ్వించలేకపోయారు. శ్రీనువైట్ల సినిమాలకు ఇది ట్రిబ్యూట్ లాంటిది అని చెప్పాలి.
కొత్త దర్శకుడి ఎంకరేజ్ చేయచ్చా.
కమర్షియల్ గా హిట్ కొట్టాలంటే రొటీన్ కథని..అంతకు మించి పరమ రొటీన్ సీన్స్ ని ఎంచుకోవాలని ఏదన్నా సిద్దాంతం తెలుగు పరిశ్రమలో నడుస్తోందేమో తెలియదు కానీ... తమ క్రియేటివిటీని మొత్తం కొత్త దర్శకులు కమర్షియాలటి పేరు చెప్పి ..పరమ రొటీన్ స్టఫ్ గా మార్చేస్తున్నారు. ఖచ్తితంగా కొత్త దర్శకుడు సినిమా చేస్తున్నాడంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అతని కొత్త ఆలోచనలు ఏ విధంగా తెరకెక్కుతాయో చూద్దామనే ఆసక్తి సినీ ప్రేమికుల్లో ఉంటుంది. అయితే అంచనాలని తమ రొటీన్ కథ,కథనాలతో అడ్డంగా నరికేస్తున్నారు ఈ దర్శకులు.
టెక్నికల్ గా ..
సినిమాలో డైలాగులు చాలా చోట్ల బాగున్నాయి. అయితే పోసాని చేత అతి డైలాగులు చెప్పించారు. మరీ చీప్ టేస్ట్. మణిశర్మ పాటలు ..ఆయన గత చిత్రాల పాటల స్దాయిలో అయితే లేవు. కానీ ఆయన బలమైన రీరికార్డింగ్ మాత్రం చాలా సీన్స్ ని లేపింది. కళ్యాణ్ రామ్ కొత్తగా చేసిందేమీ లేదు. పటాస్ కు కంటిన్యూషన్ క్యారక్టర్. అలాగే విలన్ గా చేసిన రవికిషన్ ..రేసుగుర్రం పాత్రకు కంటిన్యూషన్. ఎడిటర్ గారు.. ఫస్టాఫ్ లో కొంత ,సెకండాఫ్ లో మెసేజ్ సీన్స్ పై కాస్త దృష్టి మరింతగా పెట్టి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. మిగతా విభాగాలు సినిమా స్దాయికి తగ్గట్లే ఉన్నాయి.
ఫైనల్ ధాట్
పటాస్ లాంటి హిట్ కోసం మళ్లీ పటాస్ లాంటి సినిమానే తీయకూడదు