Movies | Music | Music

Sunita's Musical Moments at Albany

ADVERTISEMENT

ఆల్బనీలోని హిందూ దేవాలయం వారి హిందీ కల్చెరల్ సెంటర్ నందు, ఆల్బనీ తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు (సెప్టెంబర్ 27) శ్రీమతి సునీత గారి "సంగీత విభావరి" వీక్షకులకు సంగీత విందునందించింది.
శ్రీమతి సునీత మరియూ బృంద సభ్యులను ఆల్బనీ ఆంధ్ర సంఘం సభ్యులు మరియూ రసహృదయులైన ఆల్బనీ తెలుగు జనులు సాదరంగా ఆహ్వానించారు.
సునీత మ్యూజికల్ మూమెంట్స్ పేరుతో ఉత్తర అమెరికా మొత్తం పర్యటిస్తున్న టాలీవుడ్ సూపర్ సింగర్ సునీత, వర్ధమాన మధురగాయకుడు శ్రీకృష్ణ, టాలీవుడ్ కామెడీకింగ్స్ వేణు, వెంకీల కార్యక్రమం ఇంతలా విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. సునీత మ్యూజికల్ మూమెంట్స్ అక్టోబర్ మూడోవారం వరకూ జరగనున్నాయి
మహార్ణవమి మధ్యానం 2 గంటలకు మొదలైన కార్యక్రమం 3.30 గంటలపాటు ఆధ్యంతం ఉర్రూతలూగించింది. కేరింతలు కొట్టించింది. పిన్నలనుండి పెద్దలవరకూ అందరిచేతా నాట్యం చేయించింది. కార్యక్రమానికి వేంచేసిన దాదాపు 400 మంది సునీత శ్రీకృష్ణల గానాంమృతపు జడివానలో తడిసిముద్దైయ్యారు. ఈ కార్యక్రమం ఆల్బనీ హృదయాల్లో మరో మరపురాని సంగీత విభావరిలా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు.
గణేశస్తుతి తో మొదలైన కార్యక్రమం, సునీత పాడిన సోలోలనుండి, శ్రీకృష్ణతో కలిపిన యుగళాగీతాలు, ఆపాత మధురాలు, కొత్తసింగారాలతో కలిసి, ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో నుండి తకిటతధిమి తకిటతధిమి థిల్లానా లను తాకుతూ, సిరిసిరిమువ్వ లోని ఘుమ్మంది నాదం నుండి సిరివెన్నెలలోని విధాత తలపున వరకూ, నేటి యమదొంగ నుండి జల్సా, మగధీర చిరుతల నుండి గోదావరి, ఆనంద్ ల వరకూ ప్రేక్షకులకు వీనులకు విందు చేసింది. ప్రతీపాటాకి ప్రేక్షకులు గొంతుకలిపి పాడటం కనిపించింది.
కుఱ్ఱకారు స్టేజివద్ద మైమరచి నృత్యంచేయటం ఇంకోవిశేషం. పిన్నలు ప్రతీపాటకూ అలవోకగా నృత్యించటం నాట్యంచేయటం తెలుగుదనాన్ని సంస్కృతిని ప్రతిబింబచేసింది. ఔత్సాహితురాళ్ళైన ఆడపడచులు మేమూ తక్కువకాదూ అని స్టేజివద్ద నాట్యంచేయటం ఓ హైలైట్.
కార్యక్రమం మధ్యమధ్యలో వెంకీ మరియూ వేణు ల జంట చేసిన హాస్యపు చురకలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వారుపండించిన హాస్య చణుకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ప్రతీ ఛణుకుకీ పెద్దపెట్టున కరతాళ ధ్వనులు చేస్తూ ప్రేక్షకులు ఉల్లాసాన్ని అనుభవించారు.
విధాత తలపున పాటకి వేణుగానాన్ని అందించిన మూర్తి గారికి కూడా స్టాండింగ్ ఒవేషన్ లభించింది. కార్యక్రమం మొత్తానికీ ప్రేక్షకులు జైజైలు పలికారు.
మధ్యానం 2 గంటలకు మొదలైన కార్యక్రమం చివరివరకూ ప్రేక్షకులను కట్టీపడేసింది. ఎవ్వరూ కార్యక్రమం సమాప్తమైయ్యేవరకూ కదలకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ కార్యక్రమాన్ని అందించిన ఆల్బనీ అంధ్ర సంఘం ఆర్గనైజర్స్ శ్రీ చంద్ర శేఖర్ గారికి, బసవ శేఖర్ గారికి, స్పాన్సర్స్ అందరికీ, మెట్లైఫ్, తాజ్ హోటల్, తందూరి, డా॥ పద్మ శ్రీపాద, డా॥ మోహన్ పోట్లురి, డా॥ పద్మ ఆది మరియూ డా॥ విజయ్ ఆది, కుమాన్ మ్యాత్, క్రాంతి బ్యూటీ పార్లర్, బాలు దీక్షిత్, స్పీడ్వింగ్స్ ట్రావెల్, జానెట్ లా ఆఫీసెస్, మరియూ వాలంటీర్లందర్కీ ప్రేక్షకులు ధన్యవాదాలు అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆల్బనీ ఆంధ్ర సంఘం తరఫున చంద్ర శేఖర్ గారు ఆల్బనీ తెలుగు వీక్షకులకు ధన్యవాదాలు తెలియజేసారు.
Updated on September 28, 2009